- కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి
నవతెలంగాణ కూకట్ పల్లి: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న నూతన బడ్జెట్లో వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి డిమాండ్ చేశారు. ఈరోజుల్లో హాస్పటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు, నిత్యవసర ధరలు, ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని ఆయన అన్నారు. జిఎస్టి రూపంలోనే ఇప్పటికే సామాన్యులపై మోయలేనంత పన్ను భారం కేంద్రప్రభుత్వం మోపిందన్నారు. ఖర్చులు పెరుగుతున్నట్టుగా ఆదాయం పెరగటం లేదన్నారు. కాబట్టి చిరు ఉద్యోగులకు, అల్పాదాయ వర్గాలకు మేలు చేసేవిధంగా వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అన్నారు.