మీ సీఎమ్‌డీలే మీకు రోల్‌మోడల్‌

– విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ సంస్థల సీఎమ్‌డీలు దేవులపల్లి ప్రభాకరరావు, జీ రఘుమా రెడ్డిలే కొత్తగా విధుల్లో చేరే ఉద్యోగులకు రోల్‌మోడల్‌ అని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారంనాడిక్కడి మింట్‌కాపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా విధుల్లో చేరుతున్న 48 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లకు నియామక ఉత్తర్వులు అంద చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలకు వినియోగ దారులే యజమానులు అని అన్నారు. వారితో సానుకూలంగా వ్యవహరిం చాలే తప్ప, ఆవేశాలకు లోనుకా వొద్దని హితవు చెప్పారు. పనిని ఇష్టంగా చేయాలనీ, కష్టం అను కుంటే సక్రమంగా పనిచేయ లేమని అన్నారు. టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు 50 ఏండ్లు ఒకే సంస్థలో పని చేసి రికార్డు సృష్టిం చారని కొనియాడారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆఫర్‌ చేసినా తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమతో 9 ఏండ్లుగా ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థల ను సంస్కరిస్తున్నారన్నారు.టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జీ రఘు మారెడ్డి విద్యుత్‌ సంస్థనే ఇంటి లా భావిస్తూ, సిబ్బందిని కుటుం బ సభ్యులుగానే చూస్తూ పారద ర్శకంగా సంస్థను నడిపిస్తున్నా రని ప్రసంసించారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారు వీరిద్దరిని రోల్‌మోడల్‌గా ఎంచుకుంటే భవి ష్యత్‌ బంగారుమయం అవుతుం దని చెప్పారు. ఇప్పటి వరకు వి ద్యుత్‌ సంస్థల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. వాటిలో 22 వేల ఉద్యోగాలను క్రమబద్ధీకరించుకున్నామని వివరించారు. కార్యక్రమంలో సీఎమ్‌డీలు ప్రభాకరరావు, రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.