నవతెలంగాణ – భువనగిరి
ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే వేల గొంతుల లక్షల డబ్బుల ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం శుక్రవారం భువనగిరి పట్టణ కేంద్రంలో జరగబోయే సన్నాక ప్రదర్శనకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారు. కాబట్టి మాదిగలు కృష్ణ మాదిగకు చేసే ఉద్యమానికి అండగా ఉన్న వివిధ సంఘాల నాయకులు వేలాదిగా బోనగిరికి తరలిరావాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఇటుకల దేవేందర్ మాదిగ, బండారు రవి వర్ధన్, దుబ్బ రామకృష్ణ మాదిగ,బర్రె సుదర్శన్, ఈరపాక నరసింహ, పోలిశెట్టి అనిల్, సిరిపంగ శివలింగం, సిర్పంగా సుభాష్, భాస్కర్ నాయక్, గ్యాస్ చిన్న పాల్గొన్నారు.