ప్రతి విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ  నంబర్..

– 1912 నంబర్ కు  విస్తృతంగా ప్రచారం..
– 24/7 వినియోగదారులకు అందుబాటులో
నవతెలంగాణ – కామారెడ్డి 
ప్రతి ట్రాన్స్ఫార్మర్ల పై ముద్రణ  విద్యుత్ వినియోగదారులకు  మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఎటువంటి విద్యుత్ సమస్య  తలెత్తిన 1912 టోల్ ఫ్రీనంబర్ కు సంప్రదించాలని శ్రావణ్ కుమార్, కామారెడ్డి సర్కిల్  సూపెరింటెండింగ్ ఇంజనీర్ స్పష్టం చేసారు.1912 నంబర్ 24/7 వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి  1912  టోల్ ఫ్రీ  నంబర్ నిలుస్తుందని అన్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులు అనగా, ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజి, బ్రేక్ డౌన్స్, ప్రమాదభరింతగా ఉన్న స్థంబాలు, వైర్లు తదితరవి.
విద్యుత్ బిల్లుల  సమస్యలు అనగా:  పేరు మార్పు , బిల్లులలో  తేడాలు, బిల్లులో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్న  విద్యుత్ మీటర్లలో సమస్యలు, అనగా, ఆగిపోయిన మీటర్లు, పోయిన మీటర్లు,  విద్యుత్ సర్వీసుల సమస్యలు అనగా, నూతన సర్వీసు మంజూరు, సర్వీస్ క్యాన్సలేషన్, అన్ని రకాల విద్యుత్ సేవలో ఉన్నటువంటి సమస్యలు. మొదలగు అన్ని రకాల   విద్యుత్  సమస్యల  కొరకు  టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి సేవలు పొందగలరని కోరారు. వినియోగదారుల ఫిర్యాదులు  సత్వర పరిష్కారం కావడానికి టోల్ ఫ్రీ నంబర్లు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.వినియోగదారుల అభిప్రాయం కూడా తీసుకోబడుతుందని అన్నారు. ప్రతి ఒక్క వినియోగదారుడు గుర్తుపెట్టుకునేలా  టోల్ ఫ్రీ నంబర్ 1912 ను విస్తృతంగా ప్రచారం చేపడుతున్నామన్నారు.  అలాగే  రైతులకు  అవగాహన కల్పించడం కొరకు  ఈ నంబర్ ను ప్రతి ట్రాన్స్ఫార్మర్ల పై ముద్రించామని  తెలిపారు. సాంకేతికతను  జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయంలో 1912 కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, నిరంతరం ఉన్నత అధికారుల పర్యవేక్షణ జరుగుతుందని, 1912 కు  వచ్చిన ఫిర్యాదులను  సమీక్ష నిర్వహించడం  జరుగుతుందన్నారు. తద్వారా త్వరిత గతిన సమస్యలు పరిష్కారం అవుతాయాని వివరించారు.