కూలీల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

Govt should be responsible for death of laborers..– డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
 ఉపాధిహమి పనిలో చనిపోయిన  మాహిళ కూలీ కుటుంబాల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. గురువారం   ప్రమాద సంఘటనలో మరణించిన సరోజ, మమత తల్లి కూతురుల కుటుంబాలను ,గాయపడి హుస్నాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను డిబిఎఫ్ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉపాధి హమి పని ప్రదేశం, జరుగుతున్న పనుల పై అధికారుల కనీస పర్యవేక్షణ లేకపొవడం వల్లనె ప్రమాదం జరిగిందన్నారు. కూలీలు మరణించిన సంఘటన పై న్యాయ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. ఇ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇద్దరు మహిళ కూలీలు, అయిదుగురు కూలీలు గాయపడ్డప్పటికి మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ లు సంఘట స్థలాన్ని సందర్శించకపొడం తగదన్నారు. మంత్రి, కలెక్టర్ వెంటనే బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన మహిళ కూలీకుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, మృతుల కుటుంబాల కు ఉపాధి కల్పించాలని, మమత పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకొవాలన్నారు. గాయలపాలై వరంగల్ యంజియం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న స్బరూపకు 5 లక్షల నష్టపరిహారం, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. గాయాల పాలైన మరో నాలుగు కుటుంబాల కు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలన్నారు. వారు పని చేయలేరు కాబట్డి వంద రోజుల వేతనం ఒకెసారి చెల్లించాలని కొరారు. రైతు భీమా లాగా కూలీలకు పది లక్షల భీమా పధకాన్ని ప్రవేశ పెట్టాలన్నారు.ఇకనైన ఇందిరమ్మ ఆత్మీయ భరొసా పధకానికి ఉపాధి హమి షరతును ఎత్తివేయాలన్నారు. డిఅర్ డిఓను కలిసి కుటుంబాన్ని అదుకొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి నేతలు సామాజిక వేత్త పొచబోయిన శ్రీహారి యాదవ్, ఐలయ్య,డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణులు పాల్గొన్నారు.