కాంగ్రెస్ పార్టీ 2023లో అలవి గాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని గురువారం మాజీ ఎంపీపీ నారెడ్డి దశరద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు పోసానిపేటలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల శ్రీనివాస్ మాట్లాడుతూ… సాధ్యం గాని 420 హామీలను వంద రోజులు అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, బి ఆర్ ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అసత్యపు ప్రచారాన్ని మానుకోవాలని, బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నది నిజము కాదా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కోరీలు పెట్టకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులుపోతునురి ప్రసాద్, భానూరి నర్సారెడ్డి, కుషాంగి రాజనర్సు, పాల మల్లేష్, కడెం శ్రీకాంత్, జంగం లింగం, లింబాద్రి నాయక్, సంతోష్ రెడ్డి, హరిచంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.