రేపు రామారెడ్డిలో మార్కండేయ జయంతి వేడుకలు ..

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలో నేడు గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కార్యవర్గ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై ప్రార్థన గీతం, జెండా ఆవిష్కరణ, ప్రధాన వీధిలో మార్కండేయ శోభయాత్ర, మధ్యాహ్నం అన్న దానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు దోమల శ్రీధర్ తెలిపారు.