విద్యార్థి దశ నుండే రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలి..

Students should know about road rules from their stage.– ఎస్ఐ రవికాంత్ రావు..
నవతెలంగాణ – తొగుట
విద్యార్థి దశ నుండే ట్రాఫిక్, రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలని తొగుట ఎస్ఐ రవికాంత్ రావు విద్యార్థులకు సూచించారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో విద్యార్థినీ విద్యార్థులతో ట్రాఫిక్, రోడ్డు నిబం ధనల గురించి స్లొగన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మీ కుటుంబాన్ని ప్రమాదంలో పడవేయవద్దన్నారు. కారు, ఇతర వాహనాలు నడిపే సమయం సీటు బెల్టు వాడలని అన్నారు. హెల్మెట్ వాడకం ప్రణ ప్రయం నుండి విముక్తి కలుగుతుందన్నారు. ప్రయా ణం చేసేటప్పుడు అతివేగం ప్రమాదకరం అన్నా రు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టు కోవద్దన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, త్రిబుల్ రైడింగ్ వల్ల ఇబ్బందులు పడవద్దు అన్నారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకర మని, వాహనం నడిపేటప్పుడు వాహ నానికి సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యా ర్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.