నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు కోల్పోయారు ..

Many lives were lost due to negligence..– గోవర్ధనగిరి ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి

– కుటుంబానికి 25 లక్షలు, ఉద్యోగం 
– కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి 
– సీపీఐ(ఎం) నాయకులు జి శివరాజ్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఉపాధి హామీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంతో  ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని , కూలీలు మృతి చెందడం బాధాకరమని సీపీఐ(ఎం) నాయకులు జి శివరాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెక్క ఆడితే గాని డొక్క నిండని నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క కుటుంబానికి రూ .25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి తీస్తున్న( గుంత) తీసే క్రమంలో పైనుంచి మట్టి పెల్లలు, రాళ్ల బండలు పడడంతో కూలీలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారని అన్నారు.వీరితోపాటు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలిపారు. ఎంపీడీవో ,క్వాలిటీ కంట్రోలర్, మరియు ఇతర అధికారుల పర్యవేక్షణ లోపించడం మూలంగానే ఈ ఘటన జరిగిందన్నారు. మట్టిని తవ్వడం కోసం  రెండు రోజుల నుంచి భూమి పదును చేసి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఘటన జరిగిందన్నారు. నిర్లక్ష్యం ఇద్దరు కూలీల మృతికి కారణమైందన్నారు. ఉపాధి హామీ కి వెళ్లే కూలీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పనులను సంబంధిత ఏ అధికారులు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వం సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.