అమల్లో అధికారుల అలసత్వం..!

– విచ్చవిడిగా అయా రాజకీయ పార్టీల ప్లెక్సీలు.. 
– మండలంలో అమలుకు నోచుకోని ఎన్నికల ప్రవర్తన నియమావళి
నవతెలంగాణ – బెజ్జంకి 
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయాలని ఎన్నికల అధికారులు అదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో అయా రాజకీయ పార్టీల నాయకులు మండలంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని పట్టభద్రులు గురువారం ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా అమలు చేయాలని పట్టభద్రులు కోరుతున్నారు.