గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్న న్యాయవాది దేవునూరు రవిందర్ కి సిద్దిపేట, దుబ్బాక బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసి మద్దతు తెలిపింది. గురువారం సిద్దిపేట బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఎల్ సి అభ్యర్థి గా పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్న దేవునురి రవిందర్ కి మొదటి ప్రాధాన్యత సింగిల్ ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సిద్దిపేట, దుబ్బాక బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిబాబా, జీవన్ రెడ్డి, రామేశ్వర్ రావు, హరిహర రావు, తుంగా కనకయ్య, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ మాజి అధ్యక్షుడు చిత్తరి రవీందర్, పల్లే వంశీ కృష్ణ, పత్రి ప్రకాష్, చిరంజీవి లు పాల్గొన్నారు.