న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పని చేస్తోన్న టెక్నాలజీ కంపెనీ నథింగ్ తన ఫోన్ (3ఎ) సీరీస్‌ను మార్చ్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గొప్ప ఆకాంక్షలు, అత్యాధునిక ఆవిష్కరణలు, ప్రాసెసర్లు కోరుకునే వారికి ఇది మంచి అనుభవాన్ని ఇవ్వనుందని ఆ సంస్థ పేర్కొంది. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకునే కెమెరా, స్క్రీన్, ప్రాసెసర్, డిజైన్ అంశాల్లో కీలక దృష్టిని కేంద్రీకరించామని పేర్కొంది. 2020 అక్టోబర్‌లో ప్రారంభించిన తమ కంపెనీ నాలుగేళ్లలోనే బిలియన్ డాలర్ల సంస్థగా అవతరించిందని నథింగ్ పేర్కొంది.