పాఠశాల విద్యార్థులు ఆఫర్ జనరేట్ తప్పనిసరిగా చేసుకోవాలి…

– మండల విద్యాధికారి రాజ గంగారాం
నవతెలంగాణ – ఆర్మూర్   

పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు ఆఫర్ జనరేటర్ తప్పనిసరిగా చేసుకోవాలని మండల విద్యాధికారి రాజ గంగారం అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలో శుక్రవారం సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆఫర్ నమోదుకు తల్లిదండ్రుల సమ్మతి పత్రం కావాలని, ఇందుకు సహకరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాధనో పాధ్యాయులు  శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.