
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ యంగ్ ఇండియా కె బోల్ సీజన్-5 కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం అంబేద్కర్ చేసిన సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిద్ధ రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జీవన్, పార్టీ నాయకులు కిరణ్, ఎల్లం, గణేష్, స్వామి, బాబు, ప్రేమ్, మధు, చందు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.