కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సాధన కమిటీ కన్వీనర్, సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వెనకబడిన ఆదిలాబాద్ కు బడ్జెట్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సీసీఐని పునఃప్రారంభించాలని తీర్మాణం చేశారు. కేంద్ర బిందువులైన సిమెంట్ కార్పొరేషన్ పునఃప్రారంభం కావడానికి, విమానాశ్రయం నిర్మాణానికి, ఆదిలాబాద్ నుండీ ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు, సెంట్రల్ యూనివర్సిటీ, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెనకబడిన జిల్లాగా పేరోందిన ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా మూతపడిన సీసీఐని తెరిపించాలన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ ప్రజల చిరకాలవంచ అయిన ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వేలైన్ తో పాటు విమానశ్రమయం, టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు బీజేపీ రుణపడి ఉందని, ఇక్కడి నుంచి రెండు సార్లు ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే ఉన్నారన్నారు.
కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్లో అధిక నిధులు తీసుకురావడంతో పాటు సీసీఐ పునః ప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. లేని పక్షంలో పోరాటం చేయాలని వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గెలిపించిన ప్రజలే ఓడిస్తారన్న విషయన్ని గ్రహించాలని హెచ్చరించారు. సమావేశంలో బీర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ, పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రదేవేందర్, నాయకులు చిల్కా దేవిదాస్, సీపీఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వెంకట్, రైతు జేఏసీ నాయకులు బండి దత్తాత్రి, లోకరీ పోశెట్టి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి లంక జమున, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, సీపీఎం జిల్లా నాయకులు ఆర్.మంజుల, ఆర్.సురేందర్, కే.ఆశన్న, ఎన్.స్వామి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, కోశాధికారి సునీత పాల్గొన్నారు.