రాబోయే రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించి ఉన్నత విద్యను ప్రోత్సహించాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రం లోని యూనివర్సిటీ ఉన్నత విద్యను మరియు శాస్త్ర సాంకేతిక  పరిశోధనలను  బలోపేతంచేసి ప్రపంచ స్థాయి  విద్యనందించేందుకు  నుభవంతో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డికి   తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ( టూ టా ) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా టూ టా అధ్యక్షులు డాక్టర్. ఏ. పున్నయ్య మాట్లాడుతూ  రాష్ట్ర వర్సిటీల్లో  ఏటేటా ప్రొఫెసర్ల ఖాళీలు భారీగా పెరుగుపోతుం డటంతో  న్యాక్‌ గ్రేడ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వర్సిటీలు వెనకబడే పరిస్థితి ఉన్నదని గుర్తించిన  రాష్ట్ర ప్రభుత్వం  ప్రొఫెసర్ల పదవీ విరమణ పై  చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.ఈ చారిత్రాత్మక   నిర్ణయానికి  తోడ్పాటు అందించిన  రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కి, వైస్ చైర్మన్  ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశం కు,   జీవో నం.3 ను విడుదల చేసిన  విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా లకు    టూ టా సభ్యులు కృతజ్ఞతలు  తెలియజేశారు.
రాబోయే  బడ్జెట్లో  యూనివర్సిటీ లకు అధిక నిధులు కేటాయించి, సామాజిక అభివృద్ధికి నూతన కోర్సులను ప్రవేశపెడుతూ  బోధనతోపాటు  పరిశోధనలపై  రాష్ట్ర ప్రభుత్వం  దృష్టిని కేంద్రీకరించాలని  పేర్కొన్నారు.ఈ  జీవో విడుదల సందర్భంగా  సీనియర్ ప్రొఫెసర్ల  పదవీ విరమణ చేయకుండా  తెలంగాణ యూనివర్సిటీ లో  వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్   టీ.యాదగిరిరావు ను తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్  శాలువాతో  సత్కరించారు.అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్  డాక్టర్ అడికే  నాగరాజు, ప్రొఫెసర్ డాక్టర్ కనుకయ్య, ప్రొఫెసర్  విద్యావర్ధిని, ప్రొఫెసర్ ఎం అరుణ  డాక్టర్ సాయిలు, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ ఎల్లోసా,డాక్టర్ జమీల్  అహ్మద్ , డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ శిరీష  బోయపాటి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.