రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో సెక్టర్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులతోపాటు, గర్భిణీ పాలెంత మహిళలకు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన రికార్డులన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. చిన్నారులకు బరువులు ఎత్తుల ప్రకారం వారికి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. గర్భిణి బాలింత మహిళలకు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని గర్భిణీ పాలింత మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఆకుకూరలు కాయగూరల లను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు