సమ సమాజాన్ని నిర్మిద్దామని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత సంఘం పిడిఎస్యు ఏరియా కమిటీని శుక్రవారం నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఏరియా అధ్యక్షులుగా డి,నిఖిల్.. ప్రధాన కార్యదర్శి గా ప్యాట్ల మమత ఉపాధ్యక్షులు గా వినోద్, సహాయ కార్యదర్శి గా సిద్దు, కోశాధికారిగా, రాజు, సభ్యులుగా సాయి రాజ్, నితిన్, వివేక్, సచిన్, 7 గురు కో అప్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ఏరియా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జార్జి రెడ్డి స్థాపించిన పి డి ఎస్ యు ఆశయదారిలో అమరవీరుల ఆశయాల కోసం సమా సమాజ నిర్మాణం కోసం శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడుతామని విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉన్న సమస్యల పరిష్కార దిశగా పోరాడుతామని ప్రభుత్వాల నిర్బంధానలకు తలవంచమని వారు అన్నారు.