– హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
నాగ్‌పూర్ : తన్మయ్ అగర్వాల్ (136, 232 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. సివి మిలింద్ (38), హిమతేజ (31), వరుణ్ గౌడ్ (24), రాహుల్ (26) సైతం రాణించటంతో విదర్భతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 326/10 పరుగులు చేసింది. విదర్భపై తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల ఆధిక్యం సాధించింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్లలో 56/2తో ఆడుతోంది. ఓపెనర్ అథర్వ (20 నాటౌట్) అజేయంగా నిలువగా.. ధ్రువ్ (23), ఆదిత్య (5) పెవిలియన్ చేరారు. రెండో రోజు ఆట ముగిసేసరికి విదర్భ 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో నిలిచింది.