నవతెలంగాణ-సిటీబ్యూరో
1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య (ఏసీఎఫ్) ఏర్పడి 50 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం రవీంద్ర భారతిలో ఫిబ్రవరి 2న బీసీసీఈ భవన్లో నిర్వహిస్తున్న అరుణోదయ జంట నగరాల మహాసభల కరపత్రాన్ని అరుణోదయ సాంస్కతిక సమాఖ్య రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 50 వసంతాలు పూర్తి చేసుకున్న అరుణోదయ పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చేరువతుందన్నారు. ఈ మేరకు జంట నగరాల్లోని విద్యాసంస్థల్లోకి, బస్తీల్లోకి, కార్మికులపేటలోకి అనుగుణంగా జంట నగరాల సభలు నిర్వహించుకుని తగు కార్యక్రమాలు రూపొందించుకుంటున్నట్టు తెలిపారు. ఈ సభలల్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇదే ఆహ్వానంగా భావించి యువ కవులు, కళాకారులు తమ సజనను అమ్ముకోకుండా సమాజ మార్పునకు వినియోగించాలని, నెత్తురోడుతున్న ఆదివాసీ ప్రజలకు సంఘీభావం ప్రకటిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమల కళాకారుడు చెక్క గోపాల్, అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మాల్సూరు, ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల, సహాయ కార్యదర్శి రాకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.