– ఆఘమేఘాలపై సరఫరా పునరుద్దరణ…
– హర్షం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
శుక్రవారం అర్ధరాత్రి ఊట్లపల్లి వేదాంతపురం పంచాయితీ తిమ్మంపేట సమీపంలో గల విద్యుత్ స్థంభాన్ని గుర్తు తెలియని వాహనం ఒకటి ఢీ కొట్టింది. దీంతో వినాయక పురం 33 కేవీ సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామీణ ప్రాంతం మొత్తం అంధంకారం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎన్.పీ.డీ.సీ.ఎల్ ఏఈ సంతోష్ ఏడీఈ వెంకటరత్నం కు సమాచారం ఇచ్చారు. ఈయన డీఈ నందయ్య అనుమతితో అర్ధరాత్రి యుద్ద ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్ శాఖ సిబ్బందికి పలువురు వినియోగదారులు దన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ శివశంకర్, కాంట్రాక్టర్ సతీష్, వినాయక పురం, అశ్వారావుపేట సిబ్బంది పాల్గొన్నారు.