నవతెలంగాణ – కుబీర్
మండలంలో అన్ని గ్రామంలో రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ముందుగానే నీటి సమస్యపై గ్రామంలో పర్యటించాడం జరుగుతుందని మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ అన్నారు. శనివారం మండలంలోని చోండి, గోడసరా, సౌన గ్రామంలో మిషన్ భగీరథ అధికారి ప్రశాంత్ మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ రాజేష్ తో కలసి గ్రామంలో పర్యటించాడం జరిగింది. దింతో పంచాయతీ అధికారి మోహన్ సింగ్ మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామల ప్రజలకు రానున్న వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చూడాలని మిషన్ భగీరథ, పంచాయతీ కార్యదర్శి అధికారులకు సూచించారు. అదే విదంగా కొన్నిగ్రామలో ఇప్పటికి మిషన్ భగీరథ పైపులైన్ లు లేకేజేలు ఏర్పడడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదురుకోవడం జరుతున్న విషయం తెలుస్తుంది. దింతో అన్ని గ్రామంలో ప్రతి రోజు పర్యటించి నీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.దింతో గ్రామంలో ఉన్న నీటి ట్యాంకు లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చూడలని అన్నారు అదే. విదంగ మురికి కాలువలు శుభ్రం గా ఉండేలా చుడలని తెలిపారు. లేని యెడల పంచాయతీ కార్యదర్శి లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో వేసవి కాలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లు రమేష్, సాయినాథ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.