– ఈ నెల 10, 11 జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని గోడ పత్రికల ఆవిష్కరణ
నవతెలంగాణ – తాడ్వాయి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ లు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఈనెల ఫిబ్రవరి 10, 11వ తేదీన జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్ లో నిర్వహించే ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేసి, జయప్రదం చేయాలని ప్రభుత్వ కళాశాలలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవి తేజ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీమార్చ్మెంట్ రాక పేద, మధ్యతరగతి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన చెందారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ లేక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు జిల్లా కేంద్రంలో చదువుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది చదువులు మానేసి విద్యకు దూరమవుతున్నారని మండిపడ్డారు. ఈ ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరుగు ఎస్ ఎఫ్ ఐ జిల్లా మహాసభలకు అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.