
మండల కేంద్రమైన కుబీర్ లో శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశాలి కూలస్తులు మార్కండేయ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాహలు హార్పించారు. ఈ సందర్బంగా పద్మశాలి సంఘం అధ్యక్షడు గజేందర్ మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో ఉప అధ్యక్షులుపండరి సభ్యులు దేవిదాస్, భోజన్న, గణేష్ లక్ష్మణ్ సంజు, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.