భారత మహిళా క్రికెట్‌కు మరో భవిష్యత్ తార దొరికింది. అటు బ్యాట్‌తోనూ… ఇటు బంతితోనూ మ్యాజిక్ చేస్తూ తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అందరి దష్టిని ఆకర్షిస్తోంది. మహిళల అండర్ – 19 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 19 ఏండ్ల త్రిష చరిత్ర సష్టించింది. స్కాట్లాండ్‌తో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఈ కప్‌లో మరో విజయాన్ని అందించింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరిన టీమ్‌ఇండియా.. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అమె తన ఆధిపత్యం చాటుకుంది. గత 2 దశాబ్దాల నుంచి ఆటల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. వివక్షతలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి క్రీడల్లో మెరుస్తున్నారు. మిథాలీ, మేరీకోమ్, అశ్వనీ నాచప్ప, సింధు, ఛానుల బాటలో నడుస్తూ.. ఎందరో ‘యంగ్ ప్లేయర్స్’ వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రముఖ క్రీడా మణిరత్నం, జాతీయ మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ తన సత్తా చాటుతోంది భద్రాద్రి యువతి.
‘తన కూతురు క్రికెట్‌లో బాగా రాణించగలదు..’ అని బలంగా నమ్మిన ఆమె తండ్రి చిన్న వయసు నుంచే ఆమెను ఈ దిశగా ప్రోత్సహించారు. ఈ క్రీడలో రాణించేలా అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ కూతురి కష్టానికి, ఆ కన్నతండ్రి ప్రోత్సాహానికి ప్రతిఫలం తాజాగా దక్కింది. ప్రస్తుతం కౌలాలంపూర్ వేదికగా జరుగుతోన్న ‘అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్’లో సెంచరీతో చెలరేగింది త్రిష. తద్వారా ఇప్పటివరకు ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన మహిళా క్రికెటర్ గా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నదామె. దీంతో ఈ యువ ప్లేయర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది.
టీ-20లో అర్ధ సెంచరీ చేయడమే చాలా అరుదు. అలాంటిది మెరుపు వేగంతో సెంచరీ చేయడమంటే అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది గొంగడి త్రిష. ప్రస్తుతం జరుగుతోన్న ‘అండర్-19 టీ20 ప్రపంచకప్’లో పరుగుల వరద పారించి.. 59 బంతుల్లోనే 110 పరుగులతో అజేయంగా నిలిచిందీ తెలంగాణ అమ్మాయి. ఇలా ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సష్టించిందీ డ్యాషింగ్ బ్యాటర్.
అమ్మాయైనా, అబ్బాయైనా…
త్రిష తెలుగమ్మాయి. ఖమ్మంలోని భద్రాచలం ఆమె స్వస్థలం. ఆమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే మక్కువ ఎక్కువ. అదే ఇష్టం తన ఒక్కగానొక్క కూతురు త్రిషలోనూ ఉందని గుర్తించిన ఆయన.. పసి వయసు నుంచే ఆమెను ఈ దిశగా తండ్రి రామిరెడ్డి, ఆమె తల్లి మాధవి ప్రోత్సహించారు. తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్.. వంటి ఆటల్లో రాణించేలా తన చిట్టితల్లిని ప్రోత్సహించాలనుకున్న ఆయన.. తన కూతురి శారీరక సత్తువ, దేహదారుఢ్యం క్రికెట్‌కే బాగా సరిపోతుందని గుర్తించారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే త్రిషను క్రికెట్ ట్రైనింగ్‌లో చేర్పించానని చెబుతున్నారు.
‘త్రిష మా ఒక్కగానొక్క కూతురు. తను పుట్టకముందే.. మాకు పుట్టబోయేది అమ్మాయైనా, అబ్బాయైనా ఆటల్లో ప్రోత్సహించాలనుకున్నా. నా ఇష్టమే నా కూతురిలోనూ ఉందని నెలల వయసులోనే గుర్తించా. ఇంట్లో టీవీలో మేమంతా క్రికెట్ చూస్తుంటే పసి వయసులోనే తనూ మ్యాచులు చూసేది. మేం మ్యాచుల్ని ఎంజారు చేస్తుంటే తనూ కాళ్లూ, చేతులు కదిలిస్తూ నవ్వేది.. అది చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. అలా క్రికెట్ ఆటంటే తనకెంతో ఇష్టమని గుర్తించి రెండేళ్ల వయసు నుంచే ఈ క్రీడలో ప్రోత్సహించాం. తొలుత ప్లాస్టిక్ బాల్, బ్యాట్‌తో సాధన చేసేది. ఆపై టెన్నిస్ బాల్‌తో సాధన చేయించా. రోజుకు 200-300 బాల్స్‌ని ఫేస్ చేసేది. క్రమంగా ఈ సంఖ్యను పెంచుతూ పోయా. ఇక తనకు ఏడేళ్లొచ్చాక సికింద్రాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేర్పించా..’ అంటూ తన కూతురి గురించి చెబుతున్నారు రామిరెడ్డి.
భద్రాచలం టు హైదరాబాద్
త్రిష ఏడేండ్ల వయసులో మేము భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. మంచి కోచింగ్ కావాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దాని కోసం వారికి ఊళ్లో ఉన్న జిమ్, నాలుగు ఎకరాల పొలం అమ్మేశారు. కూతురి భవిష్యత్తు ముందు మిగతావన్ని తక్కువేం కాదు. హైదరాబాద్‌లో టాప్ కోచ్‌లు ఉన్న సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. వారి ఆధ్వర్యంలో మంచి నైపుణ్యం సంపాదించింది త్రిష. ఏడాది తిరిగేలోపే తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆడింది. ఎనిమిదేండ్ల వయసులో అండర్-16 రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. అందరిలో గుర్తింపు, ఇవన్నీ చూశాక తనకు ఆటపై ఆసక్తి, ఇష్టం మరింత ఎక్కువయ్యాయి. భారత జట్టుకు ఆడాలన్న పట్టుదల పెరిగింది.
పదమూడేండ్లకే మిథాలీరాజ్ తో
త్రిష క్రికెటర్ కావాలన్న స్ఫూర్తి రగిలించింది మిథాలీరాజ్. పదమూడేండ్లకే మిథాలీరాజ్‌తో కలిసి ‘సీనియర్ చాలెంజర్స్’ ఆడింది. ఆ తరువాతే తను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైంది. అక్కడి నుంచి అండర్-19 ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించింది. ఫైనల్స్‌లో రాణించి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌తో తిరిగి వస్తోంది. స్వతహాగా త్రిష ఓపెనరే అయినా ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపించుకుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే బ్యాట్స్ ఉమన్‌గా పేరు సంపాదించింది.
క్రికెట్‌లో శిక్షణ కోసమే చాలా ఖర్చు అవుతున్నా తండ్రి మాత్రం వెనకడుగు వేయకుండా ప్రోత్సహిస్తున్నారు. ‘అండర్-19 టీ20 ప్రపంచకప్’లో సెంచరీ చేయడం గొప్ప అనుభూతి. ఈ క్షణాన్ని నాన్నతో కలిసి పంచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటోందీ యంగ్ క్రికెటర్.
క్రికెట్‌నే తన కెరీర్‌గా
చిన్న వయసులోనే క్రికెట్‌నే తన కెరీర్‌గా మార్చుకున్న త్రిష.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. మైదానాన్ని ఎంత ప్రేమించిందో తరగతి గదిని అంతే గౌరవించింది. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ప్రాక్టీస్ కారణంగా స్కూలుకు వెళ్లలేకపోయినా ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకొని మరీ పరీక్షలు రాసిందీ స్టార్ ప్లేయర్. ఉదయం, సాయంత్రం నాలుగ్గంటల చొప్పున రోజుకు ఎనిమిది గంటలు క్రికెట్ సాధనే.. దీంతో స్కూలుకెళ్లడమే కష్టంగా మారింది. అయినా చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకొని మరి ఫైనల్ పరీక్షలు రాసింది. చిన్నప్పటి నుండి ఉన్న మొండితనమే తనను క్రికెట్‌లో రాణించేలా చేస్తోంది. ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్ కాలేజీలో ఇంటర్ (సీఈసీ) సెకండ్ ఇయర్ చదువుతోంది.
అనంతోజు మోహన్‌కృష్ణ 8897765417