టైటిల్‌ ఊరిస్తోంది!

The title is coming!– భారత్‌, దక్షిణాఫ్రికా అమ్మాయిల అమీతుమీ
– ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నేడు
కౌలాలంపూర్‌ : టీమ్‌ ఇండియా అమ్మాయిలు వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌పై కన్నేశారు. 2023లో తొలి అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌ సాధించిన మన అమ్మాయిలు.. నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌గా టైటిల్‌ను నిలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అద్భుత విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న భారత అండర్‌-19 అమ్మాయిలు నేడు టైటిల్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష, కమలిని సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వైష్ణవి శర్మ, సిసోడియలు బంతితో దుమ్మురేపుతున్నారు. సఫారీ శిబిరంలో జెమ్మా, సిమోన, మెసోలు బాగా ఆడుతున్నారు. 2023 ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో సఫారీలు భారత్‌కు టైటిల్‌ కోల్పోయారు. తాజా ఫైనల్లో భారత్‌పై నెగ్గి.. తీయని ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు!. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం.