సీఎం సహాయ నిధి నుంచి చెక్కు పంపిణీ..

Check distribution from CM relief fund..నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం బోర్గాం గ్రామపంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చీరడి రవి, బోధన్ నియోజకవర్గం అసెంబ్లీ యూత్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్ లు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల వైద్య సహాయం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో అందించిన ఈ ఆర్థిక సాయం ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గైన కిరణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చీరడ్డి రవి, ఉపాధ్యక్షులు సిద్ధ సాయిలు, నీరడి సంజీవ్, దూపల్లి హనుమన్లు, మద్దెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.