నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామాలలో వలసలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని పల్లె ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట మండలం ఉపాధి హామీ ఎపిఓ సుదర్శన్ గౌడ్ సూచించారు. ఆదివారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలదండావేసి నివాళులర్పించారు. సందర్భంగా ఏపీవో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ఆవిర్భవించి 20 ఏళ్లు అయ్యిందన్నారు. పథకం కింద పల్లెల్లో పలు అభివృద్ధి పనులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, పండ్లతోటలు, రోడ్లు, మొదలైన అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు రవి తదితరులు ఉన్నారు.