నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం గుంటుపల్లి గ్రామం జంగాలవారి గూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆదివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, బొబ్బా రాజేందర్ రెడ్డి, బొబ్బా లింగారెడ్డి, బొబ్బా సైదిరెడ్డి, తూటిపల్లి సైదులు, వెంకన్న, పబ్బతి రెడ్డి గోపాల్ రెడ్డి, పబ్బతి రెడ్డి సతీష్ రెడ్డి, సిరిసిల్ల లతీఫ్, అబ్దుల్ కరీం, అనుముల కోటేష్, గజ్జల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.