నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని చైతన్య కళాశాల ముందు ఉన్న విలువైన మున్సిపాలిటీ ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. త్రాగునీటి బావి లేదు. గ్రామపంచాయతీ, నగర పంచాయతీ ఉన్నప్పుడు ఈ బావిలో మోటార్ల ద్వారా ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం విలువైన స్థలం స్థలం చుట్టూ కొందరు వ్యక్తులు కాంపౌండ్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెల వేతనాలు ఇవ్వడానికి, పారిశుద్ధ్య వాహనాల నిర్వాణకు నిధులు సమకూర్చడం లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతంత మాత్రంగానే ఆదాయం ఉన్న అచ్చంపేట మున్సిపాలిటీకి అధికారులు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా ఈ స్థలాన్ని వినియోగిస్తే బాగుంటుంది. కానీ అధికారులు, చైర్మన్ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు కౌన్సిలర్లు ఈ స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని, మునిసిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా వినియోగించాలని, సూచన చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని తెలుస్తుంది. కొందరు వ్యక్తులు గత ఏడాది ఈ స్థలం చుట్టూ కంచ ఏర్పాటు చేసి వినాయకుని ప్రతిష్టించారు. గతంలో మునిసిపల్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ చైర్మన్ ను తొలగించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ గా ర్లపాటి శ్రీనివాసులు ను చైర్మన్గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీ స్థలం కబ్జా గురించి పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన మునిసిపల్ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఈ స్థలంపై విచారణ చేసి స్థలం స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.