నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 4వ వార్డులో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోగా.. విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి సకాలంలో చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమేర నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.