
నీటి సమస్య పరిష్కారానికి మండలంలోని కంచర్ల గ్రామంలో నీటి పైప్ లైన్ మరమ్మత్తులు పంచాయతీ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి స్వప్న మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ఇంటర్నల్ పైప్ లైన్ లీకేజ్ కారణంగా నీరు వృధా పోతుందని సమస్యను గుర్తించి ఆదివారం మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామంలో నీటి సమస్య ఉంటే గ్రామపంచాయతీలో తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు.