పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక  ..

An unprecedented gathering of alumni..నవతెలంగాణ – కోహెడ  

కోహెడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. చిన్ననాటి సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానించారు.