నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో రూపొందిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. తాజాగా ఇదే కలయికలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్‌గా జిమ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ఖాయమైంది. ‘జెర్సీ, గ్యాంగ్‌లీడర్’ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. గత రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘మేము మా హ్యాట్రిక్ పై నమ్మకంగా ఉన్నాం. ఇది ఒక అద్భుతం అవుతుంది’ అని నాని పోస్ట్ చేశారు. మేకర్స్ మాట్లాడుతూ, ‘శ్రీకాంత్ ఓదెల పవర్ ఫుల్, లార్జర్ దెన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. ఇది నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. కథ డిమాండ్ మేరకు గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నాం. ఈ చిత్రం ఇప్పటివరకు నాని కెరీర్లో మోస్ట్ హై బడ్జెట్ వెంచర్. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తార’ అని తెలిపారు.