
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్ర లేఖ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస, బాల్ కిషన్ సోమవారం రోజున వసంత పంచమి సందర్బంగా బాదాం ఆకుపై సరస్వతి అమ్మవారు ప్రతిమను గీసి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై చదుల తల్లి కృప కాటసాక్షం ఉండాలని కోరారు. ప్రతిమ ను చూసినవారు. బాల్ కిషన్ కు అభినందనలు తెలిపారు. గతంలోను పండ్లు, కూరగాయలు, రకరకాల వాటితో బొమ్మలు గియడం జరిగింది. ఈ ప్రతిమ పలువురిని ఆకట్టుకుంది ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా ఎలాంటి పండుగలు వేడుకలు వచ్చిన అలాంటి వాటి గురించి ఈ కళాకారుడు ప్రతిమలను గీస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. బాదం ఆకుపైన సరస్వతి అమ్మవారి ప్రతిమను గీయడం ఈ కళాకారుని పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.