తెలంగాణ భాషలో అంతర్జాత స్థాయి సరస్వతీరాజ్ హరిదా కవితలు కథల పోటీలకు ఆహ్వానం

నవతెలంగాణ కంఠేశ్వర్

హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో, నవ్య భారతి గ్లోబల్ విద్యాసంస్థల సంయుక్త నిర్వహణలో అంతర్జాతీస్థాయి సరస్వతి రాజ్ హరిదా తెలంగాణ భాషలో కవితలు కథల పోటీలకు సంబంధించిన కరపత్రాలను నవ్య భారతి గ్లోబల్ స్కూల్ ఆవరణలో ప్రముఖ వైల్డ్ ఫోటోగ్రాఫర్, నవ్య భారతి గ్లోబల్ స్కూల్ అధినేత క్యాతం సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ.. పోటీలో పాల్గొని కవులు, కవయిత్రులు, రచయితలు, రచయితలు తెలంగాణ భాషలోనే రచనలు చేయాల్సి ఉంటుందని, మే 30 వ తేదీ లోపు ఘనపురం దేవేందర్, ఇంటి నెంబరు 9-8-9, గాజుల్పేట్ నిజామాబాద్, తెలంగాణ, 503001 చిరునామాకు తమ రచనలను పంపాలని కోరారు. పోటీల వివరాల కోసం 9030033331 నెంబర్కు వాట్స్అప్ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. మొదటి ఉత్తమ కవితకు పదివేల రూపాయల నగలు బహుమతి, తరువాతి తొమ్మిది ఉత్తమ కవితలకు వెయ్యి రూపాయల చొప్పున నగదు పురస్కారాలు, మొదటి ఉత్తమ కథకు పదివేల రూపాయల నగదు బహుమతి, తరువాత తొమ్మిది ఉత్తమ కథలకు వెయ్యి రూపాయల చొప్పున నగదు పురస్కారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 4న నిర్వహించే హరిదా రచయితల మహాసభలో కవి కథకుల సమ్మేళనం తో పాటు పురస్కారాల ప్రదాన సభ ఉంటుందని ఆయన వివరించారు. తెలంగాణ భాషలో మరింత సాహిత్యం రావాలన్న సంకల్పంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కరపత్రాల ఆవిష్కరణలో తెలంగాణ భాషలో తొలి కవితా సంకలనాన్ని వెలువరించిన కవి పంచ రెడ్డి లక్ష్మణ, నరాల సుధాకర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.