
ఏర్గట్ల మండల కేంద్రంలో,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి,నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం పై నిరసన వ్యక్తంచేస్తూ…ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, నాయకులు బద్దం లింగారెడ్డి, కురాకుల బొర్రన్న, ఓర్సు రాములు, జాకీర్, మునిమాణిక్యం అజయ్, మురళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.