అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కార్యదర్శి 

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామపరిదిలో అంగన్ వాడి సెంటర్-2ను పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల రోజువారి హాజరు రిజిస్టర్ తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం చిన్నారులకు అందిస్తున్న పాలు, గుడ్లు,బాలామృతం తదితర పోషకాహారాలు సకాలంలో అందిస్తున్నారా.లేదని అరా తీశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ విజయ పాల్గొన్నారు.