మున్సిపాల్టీ తో మండలంలో తగ్గగిన ప్రాదేశిక నియోజక వర్గాలు…

Oplus_131072

– నూతనంగా మండల పటం రూపు..

– ప్రకటించిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోకి (6) ఎంపీటీసీ స్థానములు విలీనం కావడంతో  అశ్వారావుపేట, గుర్రాల చెరువు, పేరాయిగూడెం పంచాయితీలు అశ్వారావుపేట మున్సిపాలిటీ లో విలీనం అయినవి.గతంలో అశ్వారావుపేట మండలం లో (17) ఎంపీటీసీ స్థానములు ఉండగా ప్రస్తుతం (11) ఎంపీటీసీ స్థానములు కుదించ బడ్డాయి. అవి తిరుమలకుంట, నందిపాడు, గుమ్మడివల్లి, బచ్చువారి గూడెం, గాండ్లగూడెం, నారాయణపురం, కొత్త మామిళ్ళ వారిగూడెం, వినాయక పురం, ఊట్లపల్లి, అచ్యుతాపురం, నారం వారిగూడెంలు. గతంలో పేరాయిగూడెం – 2 ఎంపీటీసీ పరిధిలో వున్నా పాత అల్లిగూడెం గ్రామపంచాయతీ ని దగ్గర గా వున్నా నారం వారిగూడెం ఎంపీటీసీ పరిధిలో చేరుస్తూ ఫైనల్ ఎంపీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్  సంతకం తో అధికారికంగా ప్రకటించారు.ఈ సమాచారాన్ని మండల ప్రజా పరిషత్,అన్ని గ్రామ పంచాయతీ,తాహశిల్దార్, అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయాల్లో నోటీసు బోర్డు ల్లో ప్రకటించిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.