సాగునీరు సాధించడమే లక్ష్యం: మెట్టు సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: బీడు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఆందోల్ మైసమ్మ జలసాధన సమితి పనిచేస్తుందని జలసాధన సమితి కన్వీనర్ మెట్టు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం దేవలమ్మ నాగారం గ్రామంలో ఆందోల్ మైసమ్మ జల సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ పై బాగానా ఉండే ప్రాంతాలు సాగునీరు లేక బీడు భూములుగా మారుతున్నాయని అన్నారు.జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమానికి చౌటుప్పల్ పై భాగాన ఉన్న గ్రామలా ప్రజలు జలసాధన సమితికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంచరకుంట్ల వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సురుగు రాజమ్మ,బూడిద జగన్ మోహన్ రెడ్డి, ఏసూరి నరసింహ,జక్క యాదిరెడ్డి,దోనూరు రాజీ రెడ్డి, సుర్కంటి క్రాంతి,సత్తి రెడ్డి,ఏనుగు సత్తి రెడ్డి,బద్దం శివ రెడ్డి,వరకాంతం లింగా రెడ్డి,సుర్కంటి మల్లా రెడ్డి,సిల్వేరు సత్తయ్య,జూపల్లి రాములు,దికచెడ్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు