పోలింగ్ కేంద్రాలలో వసతి సౌకర్యాలు కల్పించాలి

నవతెలంగాణ-రాజంపేట్ ( భిక్కనూర్ )
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు లేకుండా చూడాలని, ధరణికి సంబంధించి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మార్వో అనిల్ కుమార్, ఎంఏఓ శృతి, ఎంపీడీవో రఘురాం, మిషన్ భగీరథ ఏఈ రజిత, ఏపీఎం సాయిలు, ఐ సి డి వో సూపర్వైజర్ హైమావతి, ఏపీవో సక్కుబాయి, ఎక్సైజ్ కానిస్టేబుల్ శరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.