సరస్వతీ విద్యా మందిర్ లో సామూహిక అక్షరాభ్యాసం

నవతెలంగాణ – భీంగల్ రూరల్
వసంత పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో  అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ, పరిసర గ్రామాలలోని ప్రజలు తమ పిల్లలను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు రాజేంద్రప్రసాద్ గారు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయము  నుండి పాఠశాల తెప్పించిన  కుంకుమ మరియు సరస్వతీ మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 120 మంది చిన్నారులకు  సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో భీంగల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  జి. మహేష్ పాల్గొని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని చెప్పినారు.ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య , సంయుక్త కార్యదర్శి పి మనోహర్ , ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి. అరవింద్ కుమార్ , ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్న తల్లిదండ్రులకు  పాఠశాల తరపున పేరుపేరునా
 ధన్యవాదాలు తెలియజేశారు.