
నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో హోమ్ స్కై ట్రేడింగ్ కంప్లీట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ సొల్యూషన్స్ (పీవీ సి ప్యానల్స్ షోరూం) ను సోమవారం నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకట్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర ప్రజలు ఈ షోరూమ్ కు విచ్చేసి తమ ఇంటికి అవసరమయ్యే విధంగా అన్ని రకాల ప్యానల్స్ను అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ.. నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో అన్ని రకాల పివిసి ప్యానల్స్ షోరూమ్ లో అందుబాటులో ఉంచామన్నారు వాటర్ ప్రూఫ్, టర్మెట్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్, పలు రకాల ప్యానల్స్ ను అందుబాటులో ఉంచామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విచ్చేసిన మాట్లూరు ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు అన్ని రకాల ప్యానల్స్ ను అందుబాటులో ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖిత్, సతీష్, రాజ రమేష్, నరేందర్ రెడ్డి, సుమన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.