
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు 2010 సంవత్సరంలో పాఠశాల ఆవరణంలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి వసంత పంచమి రోజు వారందరూ కలుసుకొని ఘనంగా సరస్వతి పూజను నిర్వహిస్తారు.