
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్..
నవతెలంగాణ – జన్నారం
కేంద్ర ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 5న నిరసనలకు సిఐటియు పిలుపునిచ్చిందని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుంపల రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సీఐటీయు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రనికి కేటాయించాలిసిన నిధులు, సంక్షేమానికి ఇవ్వాలిసిన నిధులు ఇవ్వకుండా, శ్రమ జీవులను, కార్మికులకు, రైతులకు అందరికి ఉపయోగం లేకుండా కేవలం ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా తెచ్చిన ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వామపక్ష కార్మిక సంఘాలు, సీఐటీయూ పిలుపునిచ్చిందన్నారు. బుధవారం అన్ని మండలాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్, రాజన్న, సుధాకర్, మల్లవ్వ తదితరులు కార్మికులు పాల్గొన్నారు.