
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం గట్కాడి పల్లి గ్రామంలో గత నెల జనవరి 22 తేదీ నుండి 15 రోజుల నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రతిరోజు హోరాహోరీగా సాగుతుంది. మొత్తం తొమ్మిది జట్లుతో 16 రోజుల నుండి ఉదయం పండ్లు,మధ్యాహ్నం భోజనం, ప్రతి మ్యాచ్ కు గ్లూకోన్ డి డ్రింక్ లాంటి వసతులతో మంచి మేనేజ్మెంట్ సభ్యులైన చెన్నకేశవులు, వినోద్ లతో డీజే సౌండ్ సిస్టంతో కామెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ మ్యాచ్లను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 3వేల ఖర్చుతో16 రోజులకు గాను 50 వేలు ఖర్చు పెట్టి మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు మేనేజ్మెంట్ సభ్యులు తెలిపారు. నేడు ఐదవ తేదీన ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రీడాభిమానులందరూ వచ్చి ప్రోత్సహించాలని మేనేజ్మెంట్ సభ్యులు కోరారు. ఈ టోర్నమెంట్ లో బహుమతుల దాతలుగా మొదటి బహుమతి 40వేలు కట్ట అనంతరెడ్డి, రెండవ బహుమతి 25 వేలు రఘుపతి రెడ్డి, ట్రోపీల బహుమతి 20 వేలు కట్ట అచ్యుతారెడ్డి, పలువురు క్రీడలకు దాతల సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు.