నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ : బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేస్తుందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్లమెంటు ద్వారా 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఏంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అనే కార్యక్రమం మాలల గురించి కాకుండా ఎస్సి వర్గీకరణ పై చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు కేవలం మోడీ సర్కులేషన్ అనుసరించినట్లుగా ఉందని ఆరోపించారు. రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది అప్పుడు ఉన్న ఎస్సీ లపై వివక్షత అంటరానితనం పోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలను అందరినీ ఒకే విధంగా పొందుపరిచి రిజర్వేషన్లను తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఉన్న బిజెపి ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. ఆర్థిక వ్యత్యాసాలను పరిగణలోకి ఈ ప్రభుత్వాలు తీసుకొని ఈ విషయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం కావాలని ఈ ప్రభుత్వం ఎస్సీలను విడదీయటానికి కుట్ర చేస్తున్నదన్నారు. దీనిని దళిత బహుజన వర్గాలు వ్యతిరేకించాలని కోరారు. ఈ ప్రభుత్వాలు మాలలపైన వివక్షత చూపుతోందని ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ న్యాయబద్ధంగా జరగాలని అన్నారు. సమావేశంలో సంఘం నాయకులు మేకల మల్లన్న, సింగరి అశోక్, పాశం రాఘవేంద్ర, గడుగు గంగన్న, మేదరి స్వామి, పోశెట్టి, అర్జున్ ప్రభాకర్, బోన్ల భూమన్న, రాములు, పోచన్న, నిమ్మల పోశెట్టి, దౌడీవార్ పోశెట్టి ఉన్నారు.