
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం సఖి కేంద్రం, మహిళ సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా అతీక్ బేగం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సైకో సోషల్ సఖీ కౌన్సిలర్ లావణ్య మహిళల చట్టాల పై అవగాహన కల్పించగా, లీగల్ కౌన్సిలర్ సంఘమిత్ర విద్యార్థులకు సమాజంలో జరిగే సైబర్ నేరాల గురించి తెలియజేసారు. అలాగే కేస్ వర్కర్ నాగమణి స్త్రీలకు సంబంధించిన చట్టాలను హెల్ప్ లైన్ సెంటర్ గురించి వివరించారు. చట్టలపైన ప్రతి ఒక్కరిమి అవగాహన ఉండాలని. సూచించారు. సమాజంలో తమకేమైన ఇబ్బందులు ఎదురైతే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ టి.స్వప్న, రేఖ, పృథ్వి, గోపాల్, బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.