– జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి టీ నాగిరెడ్డి…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో సదరం క్యాంపులో ఫిబ్రవరి 2025 కు సంబంధించి , ఇదివరకే స్లాట్ బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6, 2025వ రోజున రెన్యూవల్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని,
ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సదరం క్యాంపులకు హాజరుకావాలని మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి టి నాగిరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఫిబ్రవరి 12వ తేదీన ఆర్థోపెడిక్ శరీరం లోపం కొత్తవి 50, రెన్యువల్ 20, వినికిడి లోపం,. ఫిబ్రవరి 18వ తేదీన ఆర్తోపెడిక్ లోపం ఏమీ లేవు, వినికిడి లోపం కొత్తవి 40 , రెన్యువల్ 10, ఫిబ్రవరి 19వ తేదీన ఆర్థోపెడిక్ శరీరక లోపం కొత్తవి 50, రెన్యువల్ 20, ఫిబ్రవరి 21వ తేదీన ఆర్థోపెడిక్ లోపం కొత్త 50, రెన్యువల్ 20, ఫిబ్రవరి 22వ తేదీన మానసిక రుగ్మత కొత్తవి 40, రెన్యూవల్ 10, ఫిబ్రవరి 25వ తేదీన ఆర్థోపెడిక్ శారీరక లోపం కొత్తవి 50, రెన్యువల్ 20, ఫిబ్రవరి 28వ తేదీన కంటి లోపం కొత్తవి 30, రెన్యువల్ 10 కి సంబంధించిన వారు ఆయా తేదీలలో హాజరుకావాలని సూచించారు. మోకాళ్ళ నొప్పులు, వంటి నొప్పులు, ముసలితనంతో బాధపడుతున్న వారు, గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాల రోగాలు ఉన్నవారు సదరం క్యాంపుకు దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. మీసేవ కేంద్రంలో బుక్ చేసుకొని మెసేజ్ వచ్చిన వారు మాత్రమే ఏరియా హాస్పిటల్ భువనగిరీ ధ్రువీకరణ పత్రాలతో అనగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, డాక్టర్ రిపోర్టులు తీసుకొని సదర క్యాంపుకు హాజరుకావాలని కోరారు. సంబంధిత డాక్టర్లు పర్యవేక్షించి, వికలత్వ శాతాన్ని నిర్ధారించి, సదరం సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఒకవేళ డాక్టర్ అందుబాటులో లేనియెడల ఆ రోజు జరిగే సదరం క్యాంపు రద్దు చేయబడనున్నట్లు తెలిపారు