‘శబ్దం’ రిలీజ్‌కి రెడీ

'noise' Ready for release‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివ ళగన్‌లు రెండోసారి మరో ఇంట్రెస్టింగ్‌ సూపర్‌నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు.
7జి ఫిల్మ్స్‌ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా మేకర్స్‌ ‘శబ్దం’ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రం ఈనెల 28న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ‘వైశాలి’లో ‘వాటర్‌’ హర్రర్‌ ఎలిమెంట్‌తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివజగన్‌ ఈ సినిమాలో ‘సౌండ్‌’ అనే సూపర్‌ నేచురల్‌ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు. లక్ష్మీ మీనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌. సిమ్రాన్‌, లైలా, రెడిన్‌ కింగ్స్లీ, ఎంఎస్‌ భాస్కర్‌, రాజీవ్‌ మీనన్‌  వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 7జి ఫిల్మ్స్‌ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225కి పైగా చిత్రాలను పంపిణీ చేసి ‘ద్రౌపది, రుద్ర తాండవం’ వంటి చిత్రాలకు సహ  నిర్మాతగా వ్యవహరించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లోనే తొలి భారీ బడ్జెట్‌ చిత్రం. ఈ  చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. ప్రేక్షకులకు హర్రర్‌ స్టయిల్‌లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన  సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ‘సౌండ్‌’ ఆధారంగా తెరకెక్కడంతో, ఈ చిత్రానికి అవుట్‌ స్టాండింగ్‌ ఆడియోగ్రఫీని టి. ఉదరుకుమార్‌ సమకూర్చారు. పోస్ట్‌  ప్రొడక్షన్‌ పనులుతుది దశకు చేరుకునాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్‌ అనుభవాన్ని పొందేలా విజువల్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ఉండబోతున్నాయి. ఈ చిత్రం ఎన్‌ సినిమాస్‌  ద్వారా ఆంధ్ర, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని చిత్ర బృందం తెలిపింది. ‘ఇప్పటివరకు భిన్న సినిమాలు, భిన్న పాత్రలు పోషించా. వాటికి భిన్నంగా ఇందులో నా పాత్ర  ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాతో మరోమారు దర్శకుడు అరివళగన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభతినిస్తుందని  కచ్చితంగా చెప్పగలను’ అని హీరో ఆదిపినిశెట్టి చెప్పారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: అరుణ్‌ బత్మనాబన్‌, ఎడిటర్‌: సాబు జోసెఫ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : మనోజ్‌ కుమార్‌.